డెంకాడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన డెంకాడ మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. విజయనగరం మండలం రాకోడుకు చెందిన ఇద్దరు బైక్ పై విజయనగరం నుండి విశాఖ వెళుతున్న నేపథ్యంలో మోదవలస జంక్షన్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని పరిస్థితి పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

సంబంధిత పోస్ట్