నెల్లిమర్లలో డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి బిజెపి కార్యాలయం నందు సోమవారం భారతీయ జన సంఘ వ్యవస్థాపకుడు, విద్యావేత్త, రాజకీయ నాయకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖర్జీ చిత్రపటానికి నెలిమర్ల బిజెపి కన్వీనర్, అధ్యక్షుడు బుర్లే శ్రీధర్, ఎం ప్రసాద్ పూలమాలవేసి, ఆయన దేశానికి చేసిన సేవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం నారాయణమూర్తి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్