విజయనగరం, నెల్లిమర్ల మండలం సారపల్లి గ్రామంలో 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, గ్రామాభివృద్ధికి పాటుపడిన నిస్వార్థ నాయకుడు కీ.శే. సారపల్లి బాబురావు సంస్మరణ సభ గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ ఉపాధ్యాయ శాసన సభ్యులు పాకలపాటి రఘువర్మ, నాయకులు అల్తి శ్రీనివాసరావు, సువ్వాడ రవి, గేదెల రాజారావు, గ్రామస్థులు పాల్గొని బాబురావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.