నెల్లిమర్ల మున్సిపాలిటీలో కులాల వారీగా ఓటర్లను సంబంధిత అధికారులు బుధవారం ప్రకటించారు. మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 19075 మంది ఉన్నారు. అందులో 15134 మంది బీసీ ఓటర్లు ఉండడం గమనార్హం. ఎస్సీ ఓటర్లు 1707, ఎస్టీ ఓటర్లు 108 , ఇతర ఓటర్లు 2126 మంది ఉన్నారని తెలిపారు. మొత్తం ఓటర్లలో బీసీ ఓటర్లు సుమారు 80% ఉండడంతో ఈసారి ఎన్నికలలో బీసీ ఓటర్లు ప్రధానం కానున్నారు.