నెల్లిమర్ల: నడిపల్లిలో డయేరియా

విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలంలోని నడిపల్లిలో డయేరియా ప్రబలింది. కలుషిత నీటిని తాగిన 16 మంది వరకు వాంతులు, విరేచనాల బారినపడ్డారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది బుధవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సూపర్‌ క్లోరినేషన్‌ వల్లే డయేరియా ప్రబలిందని అధికారులు చెబుతున్నారు. అయితే సూపర్‌ క్లోరినేషన్‌ బావితో పాటు ఊరులో బావుల నీరు కూడా పరీక్షలకు పంపామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్