పూసపాటి రేగ జాతీయరహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి నేపాల్ బైక్ పై వెళ్తున్న బైక్ రైడర్ బి భార్గవ రాజు బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు భార్య నాగలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. బైక్ రైడర్ భార్గవ రాజుకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన హైవే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.