బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మంగళవారం తెల్లవారుజాము నుండి నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షంతో నగర పరిసర ప్రాంతాల్లో వరి చేనుకు చాలా అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ తుఫాను కారణంగా పిడుగులు పడే అవకాశం ఉండడంతో ఆరుబయట చెట్లు కింద కరెంటు స్తంభాల కింద ఉండకూడదని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.