తుపాను గాలులకు నేలకొరిగిన భారీ చింతచెట్టు

పార్వతీపురం మన్యం, పాలకొండలోని సీతంపేట మండలం, కురసింగి గ్రామంలో తుపాను ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షం, ఈదురుగాలులకు భారీ చింతచెట్టు నేలకొరిగింది. చెట్టు వేర్లతో సహా కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పూర్వకాలం నుండి ఉన్న చెట్టుగా గ్రామస్తులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕