రోడ్డు గోతిలో ఇరుక్కున్న ఇసుక లారీ

భామిని మండలంలోని గురుండి గ్రామ ప్రధాన రహదారిపై ఏర్పడిన గోతిలో ఇసుకతో బత్తిలి నుంచి వస్తున్న లారీ ఇరుక్కుంది. గురువారం దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడి, సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొత్తూరు-బత్తిలి మధ్య రోడ్డు గోతులతో అధ్వానంగా ఉన్నా బాగుచేసేందుకు అధికారులు చొరవ చూపడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్