వీరఘట్టం మండలం రేగులపాడు జంక్షన్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రిపేరులో ఉన్న ఆర్టీసి బస్సును వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి, అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలోని ఇతర ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.