పాలకొండ మండలం అన్నవరం వద్ద నాగావళి నదికి, దేశాయి ఛానలు పూర్తిగా సంబంధం తెగిపోయింది. దీంతో చుక్క నీరు కూడా నది నుంచి ఛానల్ కు రాకపోవడంతో ఖరీఫ్ సాగుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని బూర్జ మండల ఆయకట్ట రైతులు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తీసుకువచ్చారు. గురువారం వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఛానల్ అభివృద్ధి పనులకు సంబంధిత అధికారులుకు ఆదేశాలు జారీ చేయడంతో పనులు ప్రారంభించారు.