29న పాలకొండలో భారీ జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 29న పాలకొండ తమ్మినాయుడు డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. సాయి కృష్ణ చైతన్య ఈ వివరాలను తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైన 18–28 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు హాజరుకావచ్చు. సుమారు 10 కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తాయి. అభ్యర్థులు ముందుగా naipunyam. ap. gov. inలో నమోదు చేసుకుని, రెజ్యూమ్, ఆధార్, సర్టిఫికెట్లు, ఫోటోలు వెంట తీసుకురావాలి. మరిన్ని వివరాలకు 6301275511, 7993795796 సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్