పాలకొండ: ఆర్టీసీ డ్రైవర్ అనుమానాస్పద మృతి

బుక్కూరు గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ విఠల్ (45) అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మంగళవారం ఉదయం విఠల్ తన గదిలో విగత జీవిగా పడి ఉండడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన భార్య, మృతుడి తలపై గాయాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విఠల్ పాలకొండ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మూడు నెలల క్రితం కరుణతో వివాహం జరిగినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్