విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని ఉపవిద్యాశాఖాధికారి పి. కృష్ణమూర్తి సూచించారు. పాలకొండ మండలంలోని చిన్నంగళాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల హాజరు పరిశీలించారు. విద్యార్థుల నోట్ పుస్తకాలు చదివారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రగతి మెరుగుపడాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.