వీరఘట్టం మండలం అచ్చపువలస సమీపంలోని ఒక కోళ్ల ఫారంలో సోమవారం 1,200 కోళ్లు మరణించాయి. తీవ్రమైన ఎండలతో పాటు, సోమవారం 8 గంటల పాటు విద్యుత్ సరఫరా లేకపోవడమే కోళ్ల మృతికి కారణమని ఫారం యజమాని ఆరోపించారు. ఈ ఘటనలో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.