కార్తీక స్నానానికి వెళ్లిన మహిళ వంశధారలో గల్లంతు

శనివారం కాట్రగడలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక స్నానానికి వెళ్లిన దివ్యాంగురాలైన గౌడు జడ్డి వంశధార నదిలో గల్లంతయ్యారు. గ్రామస్థులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ఎన్. శివన్నారాయణ, బత్తిలి ఎస్ఐ జి. అప్పారావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై బత్తిలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్