ట్రాఫిక్‌లో ఇరుక్కున్న 108

పార్వతీపురంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లోపంతో మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో వాహనాలు నిలిచాయి. ఇతర వాహనాలను ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిలపడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఎమర్జెన్సీ కేసుతో వెళ్తున్న 108 ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కుపోయింది. గమనించిన చోదకులు రోడ్డుకు పక్కనున్న వాహనాలను తీయించి, 108కి దారి ఇచ్చారు. సిగ్నల్ వ్యవస్థ లోపాలు, ట్రాఫిక్ నియంత్రణ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్