మక్కువ మండలంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు

శనివారం, ఏనుగుల పర్యవేక్షణ అధికారులు మక్కువ మండలం బంగారువలస మెట్టపై ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు తెలిపారు. కట్టెల కోసం కొండ ప్రాంతంలోకి వెళ్లవద్దని పరిసర గ్రామాల ప్రజలను హెచ్చరించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులు కనిపిస్తే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని, అవి దాడి చేసే ప్రమాదం ఉందని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్