కిచ్చాడ గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం

బుధవారం మధ్యాహ్నం కిచ్చాడ గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏనుగుల కదలికలను అటవీశాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ, స్థానికులకు సమాచారం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్