బలిజిపేట: ఇంటర్ ఫలితాల్లో మెరిసిన పేదింటి విద్యార్థి

బలిజిపేట మండలం నూకలవాడ గ్రామానికి చెందిన బెజ్జిపురపు భాను ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటాడు. బొబ్బిలి తాండ్రపాపారాయ కాలేజీలో చదివిన భాను ఇంటర్ లో 988 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా సొంత గ్రామంలో పనిచేసుకుంటున్నారు. భానుకు 988 మార్కులు రావడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు, అబినందించారు. భవిష్యత్ లోఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్