చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మన్యం జిల్లా బలిజిపేట మండలం గౌరీపురంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ వై. సింహాచలం కథనం మేరకు. రాజాం మండలం పెనుబాక కు చెందిన కొరయ్ ఫణీంద్ర(27)బలిజిపేట మండలం గౌరీపురం సమీపంలోఉన్న జీడితోటలో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దింపేట గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో గౌరీపురం గ్రామాల మధ్య ఉన్న జీడితోటలో ఉరివేసుకున్నాడు.