మైత్రి మూవీస్ చిత్రంలో కానిస్టేబుల్‌గా బెలగాం చంద్రశేఖర్

పార్వతీపురానికి చెందిన నటుడు బెలగాం చంద్రశేఖర్ సినీ రంగంలో మరో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రంలో ఆయన కానిస్టేబుల్ పాత్రలో నటించారు.ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా, విశాఖపట్నంలోని హవా మహల్ పరిసరాలు, మహారాణిపేట II టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ సందర్భంగా పోలీస్ యూనిఫామ్‌లో బెలగాం చంద్రశేఖర్ నటించిన సన్నివేశాలను చిత్రీకరించారు.

సంబంధిత పోస్ట్