ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - డిఎంహెచ్‌ఓ

గరుగుబిల్లిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డిఎంహెచ్‌ఓ) డా. ఎస్. భాస్కరరావు గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం, జూలై 3న తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలు, హెచ్‌ఆర్, ఔషధ, ల్యాబ్ సేవలను పరిశీలించారు. పీహెచ్‌సీకి వచ్చే ప్రతి రోగి పట్ల తక్షణమే స్పందించి, ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పీహెచ్‌సీలో అందుతున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిఎంహెచ్‌ఓ సూచించారు.

సంబంధిత పోస్ట్