భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలోని ఓసీ త్రీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మన్యం జిల్లా సీతానగరం మండలం నిడగళ్లకి చెందిన బర్ల సాయికుమార్ అనే కార్మికుడు ఓసీ త్రీలో బ్లాస్టింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బ్లాస్టింగ్ చేయగా సమీప ప్రాంతంలోనే ఉన్న అతడి తలపై వచ్చి పెద్ద రాయి పడింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.