సీతంపేటలో బొలెరో బోల్తా.. 17 మందికి గాయాలు

సీతంపేట మండలం సవరపాడు ఘాట్ రోడ్డులో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పుట్టిగాం గ్రామంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా, 40 మంది ప్రయాణికులతో ఉన్న బొలెరో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న నీలమ్మను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్