ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మన్యం జిల్లాలో నకిలీ ఐపీఎస్‌పై శనివారం కేసు నమోదు చేసి, నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాష్ ని అదుపులోకి తీసుకున్నారు. మక్కువ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎస్ అని ఎందుకు చెప్పుకుంటున్నావని ప్రశ్నించారు. ఎవరు సాయం చేశారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఇప్పుడు నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.