పార్వతీపురం మన్యం జిల్లా, బలిజిపేట మండలం, పెదపెంకి గ్రామంలో ఫైలేరియా నిర్మూలన, గ్రామ సమగ్ర అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన రూ. 6.10 కోట్ల నిధులతో చేపట్టిన పనులను జనసేన నాయకులు మంగళవారం పరిశీలించారు. అధికారులు అందించిన గణాంకాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించిందని, పూర్తయిన పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని నాయకులు ఆరోపించారు. ఆదాడ మోహన్‌రావు, పైల సత్యనారాయణ, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.