గరుగుబిల్లి మండలం సుంకి, తోటపల్లి, నంది వానవలస గ్రామ పరిసరాల్లోని అరటి, చెరుకు తోటల్లో సోమవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరించింది. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఏనుగుల దగ్గరకు వెళ్లవద్దని, వాటిని రెచ్చగొట్టే చర్యలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు.