వివాహేతర సంబంధమే మహిళ హత్యకు కారణం..ఎస్పీ

పాలకొండలో జరిగిన మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం తెలిపారు. పాలకొండ పోలీసు స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. మృతిరాలు ప్రియుడు భువనేశ్వర్‌కు ANM కృపారాణితో వివాహేతర సంబంధం ఉండడమే ఉషారాణి హత్యకు కారణమని, ఉషారాణిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కారులో తీసుకెళ్లి హత్య చేశారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాంబాబు, సీఐ ప్రసాదు, ఎస్‌ఐ వెంకన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్