పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళింగ వైశ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు, స్థానిక మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపి, కళింగ వైశ్య సంఘాన్ని, పార్టీ సానుభూతిపరులను ఏకతాటిపైకి తెచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.