గరుగుబిల్లి: ఏనుగుల గుంపు ఎక్కడ ఉందంటే..!

గరుగుబిల్లి మండలం నందివాని వలస సమీపంలోకి ఏనుగుల గుంపు బుధవారం ఉదయం ప్రవేశించినట్లు ఫారెస్ట్ ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లవద్దని సూచించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ చెప్పే సూచనలు పాటించాలని, వారు ఏనుగుల కదలికలను నిరంతరం గమనించి తగిన సూచనలు చేస్తారని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్