గుమ్మలక్ష్మీపురం: బాల్ కోసం కొట్టుకున్న విద్యార్థులు

గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య పాఠశాలలో శనివారం ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడ్డారు. ఏడో తరగతి చదువుతున్న ధనుష్ కార్తిక్, మణికంఠల మధ్య బంతి విషయంలో గొడవ జరిగి, ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో మణికంఠ అట్టతో కొట్టడంతో ధనుష్ కార్తిక్ తలకు గాయమైంది. గాయపడిన విద్యార్థికి భద్రగిరి ఆసుపత్రిలో వైద్యం అందించారు. సంఘటనపై ఎల్విన్ పేట ఎస్సై శివప్రసాద్ వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్