అల్పపీడనంతో సాలూరు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు

సాలూరు మరియు పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుండి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంతవరకు వర్షాభావ పరిస్ధితుల్లో వరినాట్లు వేయక నారుమళ్ళ ఎండి పోయాయి. ఇప్పుడు వర్షాలు పడటం వల్ల రైతులు తమ ప్రత్తి, జొన్న వ్యవసాయం తీవ్రంగా నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటూ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని చెట్లు విద్యుత్ స్తంభాలను తాక రాదని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕