కొమరాడ: లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం

లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన కొమరాడ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కొమరాడ మండలం కొత్తవలస గ్రామానికి చెందిన బిడ్డిక లక్ష్మణ కొమరాడ మండల కేంద్రంలో వెళుతున్న నేపథ్యంలో ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ పైనుండి లారీ చక్రాలు వెళ్లడంతో అతడు అక్కడకక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

సంబంధిత పోస్ట్