పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని కె. నాగలింగేశ్వరుడు అనే వ్యక్తి మృతి చెందాడు. కొత్తవలసకు చెందిన నాగలింగేశ్వరుడు పిఠాపురం నుంచి తిరిగి వస్తుండగా, టౌన్ గేటు వద్ద రైల్వే పట్టాలు దాటే ప్రయత్నంలో గుంటూరు-రాయగడ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రత్నకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.