తోణాంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి

మంగళవారం తెల్లవారుజామున సాలూరు మండలం తోణాంలో మామిడి అమ్మాజీ (30) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఆమె ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 2022లో వివాహం జరిగిన అమ్మాజీ, వ్యక్తిగత కారణాలతో భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె మృతికి గల కారణాలపై రూరల్ ఎస్సై రవీంద్ర దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణలో వెల్లడవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్