టీడీపీ నాయకుడి తల్లికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నివాళి

టీడీపీ నాయకులు గవర గుంప స్వామి తల్లి గవర సూరమ్మ స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆదివారం ఉదయం పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చేరుకొని సూరమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని వేడుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్