ఎంపీ ల్యాడ్స్ పనులు వేగవంతం చేయండి.. కలెక్టర్

ఎంపీ ల్యాడ్స్ నిధులతో జిల్లాలో నిర్మిస్తున్న బస్ షెల్టర్ల పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. వీడియో కాన్ఫిరెన్స్‌లో అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనుల్లో జాప్యం చేస్తే సంబంధిత ఇంజినీరింగ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్