పార్వతీపురం మన్యం పాలకొండ మండలం బాసూరులో గురువారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. డాన్స్ చేస్తున్న వ్యక్తిని హార్ట్ స్ట్రోక్ రూపంలో మృత్యువు కబలించింది. పెయింటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న సుంకరి బంగారునాయుడు (36) గ్రామంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో డాన్సు చేస్తూ గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంగారు నాయుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.