మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని సుంకి, తోటపల్లి, సంతోషపురం, నందివానివలస గ్రామ పరిస రాల్లో గత నాలుగు రోజుల నుంచి ఏనుగులు గుంపు సంచరిస్తున్నాయి. తోటపల్లి పం చాయతీ నందివానివలస తోటల్లో శుక్రవారం ఉదయం సంచరించాయి. ఏనుగులు ప్రధాన రహదారి పక్కనే ఉన్న తోటల్లో సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరారు.