పార్వతీపురం: జంతి కొండ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఏనుగులు గుంపు

శుక్రవారం ఉదయం పార్వతీపురం మండలం డోకిశీల సమీపంలోని జంతికొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి ఏనుగుల గుంపు ప్రవేశించినట్లు ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారులు తెలిపారు. అటువైపు ప్రయాణించేవారు, పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళల్లో పంట పొలాల్లోకి వెళ్లవద్దని సూచించారు. గత 10 ఏళ్లుగా మన్యం జిల్లాను ఏనుగుల గుంపు వదలకుండా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్