పార్వతీపురం: పౌడర్‌ రాసుకుంటేనే కూలి పని..!

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో బుధవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అక్కన్నగూడకు చెందిన సవర సుంబురు మొదటి రెండు రోజులు ఫొటో అప్‌లోడ్ కాకపోవడంతో మూడో రోజు ముఖానికి పౌడర్ పూసుకొని వచ్చాడు. ఫొటో స్పష్టంగా పడటంతో వెంటనే అప్‌లోడ్ అయ్యి పని నమోదయింది. ఆయన వినూత్న ప్రయత్నాన్ని చూసి ఇతర కార్మికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఉపాధి పనుల్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు అద్దంపడుతోంది.

సంబంధిత పోస్ట్