పార్వతీపురం మన్యం జిల్లాలో సంక్రాంతి పండగ సందడి ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు సెలవులు ప్రకటించడంతో పట్టణాల నుంచి వేలాదిమంది విద్యార్థులు, అలాగే ప్రజలు, వలస కూలీలు రైలు, బస్సుల్లో సొంత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. రెండు రోజులుగా పార్వతీపురం రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికుల రాకపోకలతో కిక్కిరిసిపోతోంది.