పార్వతీపురం: యువతి కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం

టెక్కలిలో ఆదివారం ప్రియురాలు అలిగిందని రైలు పట్టాలపై తలపెట్టిన యువకుడి ఘటనలో అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. పార్వతీపురం ప్రాంతానికి చెందిన యువతిని చూడటానికి వచ్చిన యువకుడు, ఆమె అబద్ధం చెప్పిందని అలకబూని పట్టాలపైకి వెళ్ళాడు. అక్కడినుంచి వెళ్లిపోతే ప్రమాదం జరుగుతుందని హెచ్చరించడంతో గుణుపూర్ వెళ్తున్న పాసింజరు రైలు కాసేపు నిలిచిపోయింది. పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కు తరలించి, తల్లిదండ్రుల సమక్షంలో హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్