పార్వతీపురం మన్యంలో మళ్లీ వర్షం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో గురువారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అయితే, మళ్లీ కురుస్తున్న వర్షంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా వర్షాలు కురిస్తే వరి, పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్