పార్వతీపురం పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. గురువారం సాయంత్రం సమయంలో ఆకస్మికంగా భారీ వర్షం కురవడంతో వాహనచోదకులు, ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కురిసిన భారీ వర్షానికి పది రోజులుగా వరి నాట్లు కూరగాయల నార్లు వేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.