పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సాక్షి టీవీ రిపోర్టర్ నల్లి శ్రీనుపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి వస్తుండగా రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో అడ్డగించి విచక్షణారహితంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయాడు. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.