సాలూరు: అదుపుతప్పి ఆటో బోల్తా.. గిరిజన మహిళ మృతి

పాచిపెంట మండలంలో కర్రి వలస జంక్షన్ వద్ద రహదారిపై మంగళవారం ఆటో బోల్తా పడిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. చినచీపురు వలస గ్రామానికి చెందిన కోట సోమమ్మ(64) మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. వ్యవసాయ పనులకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్న అంటున్నారు. వర్షం కారణంగా అదుపు చేయలేక పక్కనే ఉన్న పొలంలోకి వెళ్లి బోల్తా పడినట్లు స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్