పిడుగుపడి గిరిజనుడు మృతిచెందాడు. ఈ సంఘటన మన్యం జిల్లా దేవనాపురం పంచాయతీలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం…సీతంపేట మండలంలో జగత్‌పల్లి బూర్జిగూడ చెందిన సవర చందర్రావు (28) దేవనాపురం సమీపంలో ఉన్న పొలంలో శుక్రవారం ట్రాక్టర్ ద్వారా దున్నించడానికి వెళ్లాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. పొలానికి కొద్ది దూరంలో ఉన్న చందర్రావుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.