సీతానగరం మండలం లచ్చయ్యపేట-అంటిపేట గ్రామాల మధ్య రహదారిపై ఒంటరిగా ఉన్న 9 ఏళ్ల బధిర బాలికను పోలీసులు స్థానికుల సహాయంతో ఆదివారం రక్షించారు. విజయనగరం జిల్లా పాతబొబ్బిలి సమీపంలోని నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో చదువుకుంటున్న బాలిక, తల్లిదండ్రులపై బెంగతో శనివారం రాత్రి ఆశ్రమం నుంచి బయటకు వచ్చి రహదారి పక్కన ఒంటరిగా కనిపించింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు బాలికను సంరక్షించి, ఆమె ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆశ్రమం నిర్వాహకులు గుర్తించి స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం పోలీసులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి, బాలికను వారికి అప్పగించారు.